Sunday, January 19, 2025
HomeTrending Newsరాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

ఆంధ్ర ప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ, పక్షపాతం చూపిస్తోందని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి వి.విజయసాయి రెడ్డి ఆరోపించారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో జాప్యం చేస్తున్నారని అయన విమర్శించారు. రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డితో పాటు లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు మానుకోవాలని సమావేశంలో గట్టిగా కోరామని తెలిపారు.

విజయసాయి మాట్లాడిన అంశాలు:

  • పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 55,657 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి వుంది, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోంది
  • టెక్నికల్ కమిటి అనుమతించినా ఈ ప్రతిపాదన ఆర్ధిక శాఖ వద్దే ఉంది
  • “పోలవరం అథారిటీ” కార్యాలయాన్ని రాజమండ్రి కి తరలించాలని కోరాం.
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాం
  • విశాఖ ఉక్కు కు లాభాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలి.
  • ఈ అంశం పై మూడు ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇచ్చాము
  • ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగాము, దీనిపై కూడా కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. ఇది సవతి తల్లి ధోరణి
  • పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో  పెట్టిన బిజెపి, ఏపీకి హోదా ఎందుకు ఇవ్వడం లేదని అడిగాం
  • రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి ఇవ్వాలని కోరాము
  •  బియ్యం సబ్సిడీ బకాయిలు రూ. 5,056 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాం
  • ఉపాధి హామీ నిధులు 6,750 కోట్లు రావాల్సి ఉంది, వాటిని కూడా ప్రస్తావించాం
  •  వంశధార ట్రిబ్యునల్ జడ్జిమెంట్ కి సంబంధించి గెజిట్ విడుదల చేయాలని కోరాం
  •  పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది.
  • పెండింగ్ లో ఉన్న “దిశా”బిల్లును క్లియర్ చేయాలని కోరాం
  • తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆరువేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాలి. వాటిని ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.
  • అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్ స్కాం, రథం దగ్ధం పై సీబీఐ దర్యాప్తు జరగాలని కోరాను.
  • శరద్ యాదవ్ విషయంలో వారం రోజుల్లో అనర్హత వేటు వేశారు.
  • ఏడాది కిందట మేము అనర్హత పిటిషన్ ఇస్తే , స్పీకర్ ఇప్పుడు నిద్రలేచారు.
  • సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆరు నెలల్లో లోపు అనర్హత విషయంలో చర్యలు తీసుకోవాలి
  • బీజేపీకి అనుకూలంగా ఉంటే ఒకలా,  వ్యతిరేకంగా ఉంటే మరొకలా స్పీకర్ వ్యవహరిస్తున్నారు.
  • కేంద్ర ప్రభుత్వం ఈ ద్వంద్వ ప్రమాణాలు మానుకోవాలి.
  • “ప్రధాన మంత్రి ఆవాస్ యోజన” కింద 11 వేల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం కేటాయించాలని కోరాను.
  • ఈ అంశాలన్నీ పార్లమెంటులో కూడా లేవనెత్తుతాం.
  • దీనిపై పార్లమెంటులో ఆందోళన కూడా నిర్వహిస్తాం.

మిథున్ రెడ్డి మాట్లాడిన అంశాలు:

  • విభజన చట్టం అమలుకు పదేళ్ళు గడువు పెట్టారు
  • ఇప్పటికి ఏడేళ్ళు పూర్తయ్యి  ఎనిమిదో ఏడు నడుస్తోంది, ఇప్పటికీ ఇంకా హామీలు అమలు కాలేదు
  • ఈ హామీలపై సమావేశాల్లో చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరాం
  • షార్ట్ డిస్కషన్ కోసం అనుమతించాలని అడిగాం
  • లేని పక్షంలో సమావేశాల్లో మా నిరసన తెలియజేస్తాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్