Saturday, November 23, 2024
HomeTrending NewsPMAY: మోడీ ఫొటో ఏది? : కేంద్రమంత్రి ఆగ్రహం

PMAY: మోడీ ఫొటో ఏది? : కేంద్రమంత్రి ఆగ్రహం

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ ఇళ్ళు’ నినాదానికి కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ స్పష్టం చేశారు. మోడీ పాలన తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న జన సంపర్క్ అభియాన్ లో భాగంగా పశ్చిమ  గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆమె…నేడు పాలకొల్లులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, టిడ్కో ఇళ్ళ నిర్మాణాన్ని పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెసుకున్న ఆమె, వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తోన్న ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన బోర్డులపై ప్రధాని మోడీ ఫొటో ఎందుకు ముద్రించడం లేదని ఆమె అధికారులను నిలదీశారు.  ప్రధానమంత్రి ఆవాస్ యోజన లోగోను కూడా ముద్రించకపోవడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వెలిబుచ్చిన కేంద్ర మంత్రి వెంటనే ఫొటో ఏర్పాటు చేయాలని సూచించారు.

నేడు పాలకొల్లులో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న భారతి రేపు 23న అవనిగడ్డ నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజుతో కలిసి పర్యటించనున్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం స్థానిక ఆర్య వైశ్య కల్యాణ మండపంలో డ్వాక్రా మహిళలతో సమావేశమవుతారు. 11.30 కి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరువోలు బుచ్చిరాజు ఇంటికి వెళ్లి ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు కోసూరి వారి పాలెం లో జల్ జీవన్ మిషన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్టారు. 4 గంటలకు బిజెపి కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో అవనిగడ్డ గర్ల్స్ హై స్కూల్ లో జరిగే మహా జనసంపర్క అభియాన్ బహిరంగ సభకు ముఖ్యఅతిధిగా హాజరవుతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్