Thursday, March 12, 2026
HomeTrending Newsబడ్జెట్ అంశాల్లో సెస్ కీలకం - మంత్రి హరీష్

బడ్జెట్ అంశాల్లో సెస్ కీలకం – మంత్రి హరీష్

తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం సెస్ సంస్థను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికపుడు విలువైన సూచనలు చేస్తున్నదని కొనియాడారు. హైదరాబాద్ బేగంపేట్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ – సెస్ లో విద్యార్థునుల వసతి గృహానికి శంకుస్ధాపన చేసిన ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, సెస్ ఫౌండర్ మెంబర్లు మహేందర్ రెడ్డి, జి ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయిలో ఇక్కడి పీహెచ్డీ కోర్సుకు డిమాండ్ ఉందని, వివిధ రాష్ట్రాల నుండి విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారని మంత్రి వెల్లడించారు. విద్యార్థుల కోసం రు. 5 కోట్లతో బాలికల వసతి గృహం ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుందని, ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బడ్జెట్ అంశాలకు సంబంధించి సెస్ తో కలిసి మరింత సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి హరీష్ రావు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular