Saturday, January 18, 2025
Homeసినిమాలాల్ సింగ్ చ‌డ్డాపై ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేసిన చైతూ

లాల్ సింగ్ చ‌డ్డాపై ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేసిన చైతూ

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చ‌డ్డా. ఇందులో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, క‌రీనా క‌పూర్ జంట‌గా న‌టించారు. నాగ‌చైత‌న్య కీల‌క పాత్ర పోషించారు. అయితే.. అమీర్ ఖాన్ మూవీలో చైతూ పాత్ర ఐదు లేదా ప‌ది నిమిషాలు అనుకున్నారు. కానీ ప్రస్తుతం వినిపిస్తోన్న వార్తల ప్రకారం ఈ క్యారెక్ట‌ర్ ఏకంగా అర‌గంట సేపు ఉంటుంద‌ని తెలియ‌డంతో ఫ్యాన్స్ మ‌రింత ఈగ‌ర్ గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీని ప్ర‌జెంట్ చేస్తుండ‌డంతో లాల్ సింగ్ చ‌డ్డా పై మ‌రింత క్యూరియాసిటీ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి నాగ‌చైత‌న్య ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో బాల‌రాజు క్యారెక్ట‌ర్ గురించి ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో చూపించాడు. అయితే.. బాల‌రాజుగా తాత గారు న‌టించ‌డం.. ఇప్పుడు త‌ను బాల‌రాజు క్యారెక్ట‌ర్ చేయ‌డం అంతా ఓ మ్యాజిక్ అనిపిస్తుంటుందని చైత‌న్య చెప్పాడు.

అంతే కాకుండా.. లాల్ సింగ్ చ‌డ్డా షూటింగ్ అయిపోయింద‌ని చెప్పిన‌ప్పుడు బాధేసింది. షూటింగ్ జ‌రిగిన అన్ని రోజులు న‌న్ను నేను మ‌రిచిపోయాను అన్నారు. చైతు క్యారెక్ట‌ర్ కోసం అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హెయిర్ స్టైల్, లుక్ రిఫ‌రెన్స్ గా తీసుకున్నారు. మొత్తానికి లాల్ సింగ్ చ‌డ్డా ఆడియ‌న్స్ లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆగ‌ష్టు 11న సినిమా రిలీజ్ అవుతుంది. మ‌రి.. చైతన్య బాలీవుడ్ లో ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో చూడాలి.

Also Read : నెక్ట్స్ మూవీస్ పై క్లారిటీ ఇచ్చిన నాగ‌చైత‌న్య‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్