Monday, March 16, 2026
Homeసినిమాచైతన్య, వెంకట్ ప్రభు మూవీ ప్రీ లుక్ రిలీజ్

చైతన్య, వెంకట్ ప్రభు మూవీ ప్రీ లుక్ రిలీజ్

నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్ లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. ‘NC22’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగానటిస్తోంది. నాగ చైతన్య కెరీర్ లో అత్యంత భారీ చిత్రాల్లో NC22  ప్రాజెక్ట్ ఒకటి. తారాగణం, అద్భుతమైన సాంకేతిక విభాగం ప్రకటనతో ఈ చిత్రం భారీ బజ్ను క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ స్టన్నింగ్ ప్రీ లుక్ తో అభిమానులను, సినీ ప్రేమికులను సర్ ప్రైజ్ చేశారు. ప్రీ-లుక్ లో నాగ చైతన్య పోలీస్ అవతార్ లో ఫెరోషియస్ లుక్ లో కనిపించారు.

నాగచైతన్య తోటి అధికారుల చేతుల్లో లాక్ చేయబడినట్లు కనిపిస్తున్నాడు. అతని ఆవేశాన్ని అదుపు చేయడానికి తుపాకీలను కూడా గురిపెట్టడం గమనించవచ్చు. ఈ ఇంటెన్స్ లుక్..  ఫస్ట్ లుక్ పై అంచనాలను పెంచింది. ఫస్ట్ లుక్ నవంబర్ 23 తేదీ ఉదయం 10:18 గంటలకు చైతన్య పుట్టినరోజు సర్ ప్రైజ్గా విడుదల కానుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular