Sunday, January 19, 2025
Homeసినిమాచైతూ మరో బాలీవుడ్ సినిమా చేస్తున్నారు

చైతూ మరో బాలీవుడ్ సినిమా చేస్తున్నారు

Bollywood: యువ స‌మ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చ‌డ్డా. అమీర్ ఖాన్, క‌రీనా క‌పూర్ జంట‌గా న‌టించిన లాల్ సింగ్ చ‌డ్డా ఆగ‌ష్టు 11న విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ లో బాగా ప్ర‌మోష‌న్స్ చేస్తుండ‌డంతో భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్న ఈ మూవీ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుంది అనేది ఆస‌క్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబాయి వెళ్లిన నాగ చైతన్య బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ని ఆయన ఆఫీస్ కు వెళ్లి మరీ కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఒక సినిమాతో బిజీగా ఉన్న సంజయ్ లీలా భన్సాలీ స్వయంగా నాగ చైతన్యను పిలిపించుకుని మరీ మాట్లాడటంతో అసలు ఏం జరుగుతుంది అంటూ ఉత్తరాది మీడియాతో పాటు సౌత్ ఇండియన్ సినీ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది.

హిందీలో నాగ చైతన్య సెకండ్ లీడ్ గా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయని.. హీరోగా ఆఫర్ వచ్చినా హిందీ సినిమాను చేసేందుకు సిద్ధం అన్నట్లుగా చైతూ ఆ మధ్య అన్నాడు. ఆ కారణంగానే సంజయ్ లీలా భన్సాలీ తాజాగా ఒక సినిమా నిమిత్తం నాగ చైతన్య తో మాట్లాడేందుకే పిలిచార‌ని టాక్ వినిపిస్తోంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ డైరెక్ష‌న్ లో నాగ‌చైత‌న్య న‌టిస్తే.. బాలీవుడ్ లో చైతు బిజీ అవ్వ‌డం ఖాయం అంటున్నారు సినీ జ‌నాలు. మ‌రి.. చైతు, భ‌న్సాలీ మూవీ సెట్ అవుతుందేమో చూడాలి.

Also Readలాల్ సింగ్ చ‌డ్డాకు చైత‌న్య నో చెప్పాడా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్