Sunday, January 19, 2025
Homeసినిమాగోపీచంద్ చేతులమీదుగా ‘ఛ‌లో ప్రేమిద్దాం` ఫ‌స్ట్ లుక్

గోపీచంద్ చేతులమీదుగా ‘ఛ‌లో ప్రేమిద్దాం` ఫ‌స్ట్ లుక్

హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘ఛ‌లో ప్రేమిద్దాం’. డైర‌క్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని ఈ సినిమా ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు.

గోపిచంద్ మ‌లినేని మాట్లాడుతూ “ఓ రోజు డైర‌క్ట‌ర్ సురేష్ వ‌చ్చి మోష‌న్ పోస్ట‌ర్ చూపించారు. మోష‌న్ పోస్ట‌ర్ న‌చ్చడంతో లాంచింగ్ కి వ‌చ్చాను. అంద‌రూ ప్రొడ్యూస‌ర్ గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత వెంక‌ట్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయ‌న కూడా ఒక కొత్త డైర‌క్ట‌ర్ కి ఎంత స‌పోర్ట్ చేయాలో అంత స‌పోర్ట్ చేశారు. అలా ‘ఛ‌లో ప్రేమిద్దాం’ నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ గారు ఇచ్చిన మాట కోసం సురేష్‌కి సినిమా ఇచ్చారు. అలాంటి గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న ఉద‌య్ కిర‌ణ్ గారు ఖచ్చితంగా గొప్ప నిర్మాత‌గా ఎదుగుతారు. ఇక ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ చూశాక విజువ‌ల్ ట్రీట్ లా సినిమా ఉండ‌బోతుంద‌ని అర్థమ‌వుతోంది. అంతా యంగ్ టీమ్ ప‌ని చేశారు.  భీమ్స్ ఎప్ప‌టిలాగే ఈ సినిమాకు కూడా మంచి పాట‌లు  ఇచ్చార‌నుకుంటున్నాను. యూనిట్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్