Saturday, January 18, 2025
Homeసినిమాజ‌గ‌ప‌తిబాబు చేతుల మీదుగా ‘ఛ‌లో ప్రేమిద్దాం’ పాట

జ‌గ‌ప‌తిబాబు చేతుల మీదుగా ‘ఛ‌లో ప్రేమిద్దాం’ పాట

Chalo Premiddam First Single Released By Jagapathi Babu :

హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరోహీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని ఫ‌స్ట్ సింగిల్ ఈ రోజు విభిన్న న‌టుడు జ‌గ‌ప‌తిబాబు లాంచ్ చేసి యూనిట్‌కు శుభాకంక్ష‌లు తెలిపారు. `ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏలు చ‌ద‌వ‌లేక‌పోతివి` అంటూ సాగే ఈ కాలేజ్ సాంగ్ కు దేవ్ ప‌వార్ అద్భ‌త‌మైన‌ సాహిత్యాన్ని స‌మ‌కూర్చ‌గా వెంక‌ట్ దీప్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఆదిత్య ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుద‌లైంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ “ఈరోజు జ‌గ‌ప‌తిబాబు గారి చేతుల మీదుగా మా చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ లాంచ్ చేశాం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు చాలా థ్యాంక్స్. ఇక ప్ర‌స్తుతం మా సినిమాకు సంబంధించిన సెన్సార్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

డైర‌క్ట‌ర్ సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లే మాట్లాడుతూ “ఇటీవ‌ల విడుద‌లైన మా చిత్రం ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక ఈ రోజు మా చిత్రంలోని ఫ‌స్ట్ సింగిల్ ను జ‌గ‌ప‌తి బాబు గారు లాంచ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. వ‌రుస‌గా ఒక్కో సింగిల్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేశాం. అతి త్వ‌ర‌లో సినిమా విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం” అన్నారు.

హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ…“జ‌గ‌ప‌తి బాబు గారు మా మూవీ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేయ‌డం హ్యాపీ. సినిమాలో వ‌చ్చే ఫ‌స్ట్ సాంగ్ ఇది. చాలా ఎన‌ర్జిటిక్ గా ఉంటుంది. భీమ్స్ గారు వండ్ర‌ఫుల్ కంపోజ్ చేశారు. వెంక‌ట్ మాస్ట‌ర్ స్టెప్స్ కూడా కొత్త‌గా ట్రై చేశారు. అంద‌రికీ సాంగ్ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాం” అన్నారు.

Must Read : మెరిసే మెరిసే’ రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది : శ్వేతా అవ‌స్తి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్