Sunday, January 26, 2025
HomeTrending NewsChandrababu: లక్ష మెజార్టీ లక్ష్యం: కుప్పంలో బాబు

Chandrababu: లక్ష మెజార్టీ లక్ష్యం: కుప్పంలో బాబు

ప్రజల కోసం తాము రూపొందించిన సూపర్ సిక్సర్ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్ళి వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం చేకూర్చేలా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కుప్పంలో టీడీపీకి ‘లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యం’ క్యాంపెయిన్ ను చంద్రబాబు ప్రారంభించి అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కుప్పం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ఏడుసార్లు తనను గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. గత 35 ఏళ్ళలో తాను ఎన్ని పనులు చేశానో రాబోయే ఐదేళ్ళలో అన్ని పనులు చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు.

ఉత్తర కొరియాలో కిమ్ లాగా సిఎం జగన్ ఇక్కడ వ్యవహరిస్తున్నారని, కానీ తెలంగాణాను దక్షిణ కొరియాలాగా తయారు చేశారని, తానూ వేసిన మార్గాన్ని ఆ ప్రభుత్వం కొనసాగిస్తోందని బాబు పేర్కొన్నారు. మళ్ళీ రాష్త్రం బాగుపడాలంటే టిడిపి అధికారంలోకి రావాలన్నారు.  బటన్ నొక్కడం గొప్ప కాదని, సంపదను సృష్టించి ఆ డబ్బులు పేదవారికి చెందేలా చూడాలని అది గొప్పతనమని బాబు వ్యాఖ్యానించారు. తాను సంపదను సృష్టిస్తానని, దాన్ని పేదవారికి అందేలా చూస్తానని చెప్పారు.  నాడు తాను ఇచ్చిన పిలుపుతో జన్మ భూమి స్పూర్తితో విదేశాల్లో ఉన్న తెలుగువారు స్వగ్రామాల అభివృద్ధికి కృషి చేశారని, ఇప్పుడు కూడా అలాగే పూర్ టు రిచ్ కార్యక్రమాన్ని తలపెట్టామని, ధనవంతులుగా ఎదిగిన వారు పేదవారి అభ్యున్నతికి పాటు పడాలని సూచించారు. కుప్పంలో వెనుకబడిన వర్గాలు అధిక సంఖ్యలో ఉన్నారని వారికి అండగా ఉంటూ కులవృత్తులకు చేయూత ఇస్తామని హామీ ఇచ్చారు.  రాజకీయాల్లో నిన్న గాక మొన్న వచ్చిన పిల్ల కుంకలు కూడా కుప్పంలో తామే గెలుస్తామంటూ బీరాలు పలుకుతున్నారని, వారి ఆటలు సాగవని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్