Sunday, January 19, 2025
HomeTrending Newsఏపీపీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ: చంద్రబాబు

ఏపీపీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ: చంద్రబాబు

ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్సీపీ నేతలు  సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. గతంలో ఒక్క స్కామ్ చేస్తేనే పార్టీలు మూతపడేవని, కానీ వైసీపీ హయంలో వందల కొద్దీ స్కామ్ లు జరుగుతున్నాయని, స్కామ్ లు చేయడానికే స్కీమ్ లు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టులపై ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు స్పందించారు. ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దీనిపై వివరిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

బాబు మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • ప్రతి ఒక్కరి ఆశ ప్రజా సేవ.  కొంతమంది రాజకీయాల ద్వారా సేవ చేయాలనుకుంటారు
  • ప్రభుత్వ సేవలందించాలని కొంతమంది గ్రూప్ పరీక్షలకు వస్తాయి
  • సర్వీస్ కమిషన్‌లో ఎంపికై పేదరిక నిర్మూలనకు కృషి చేయాలనుకుంటారు
  • నీతి నిజాయితీ సమర్థతకు పెద్దపీట వేసి చైర్మన్‌ను నామినేట్ చేస్తారు
  • సమర్థ చైర్మన్ లేకపోతే బోర్డు అంతా సర్వనాశనమవుతుంది
  • రాజకీయ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీని పునరావాస కేంద్రంగా మార్చారు
  • రాష్ట్ర యువతను దుర్మార్గంగా దగా చేసి వారి ఆశలు చంపేశారు
  • క్షమించరాని నేరం చేసిన దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పు లేదు
  • నిరుద్యోగ యువత పట్ల క్రూర మృగాలకంటే ఘోరంగా వ్యవహరించారు
  • తిట్టేందుకు సరైన మాటలు కూడా రానంత నీచంగా వ్యవహరించారు
  • నిరుద్యోగులకు వెలుగులు పంచాల్సిన ఏపీపీఎస్సీ చీకట్లు నింపింది
  • నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్‌భాస్కర్‌ను మెడపెట్టి బయటకు పంపారు
  • అవగాహన లేని అనర్హులకు ఏపీపీఎస్సీలో చోటు కల్పించారు
  • జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్‌ను నియమించారు
  • 2018లో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్‌లో అవినీతే రాజ్యమేలింది
  • గౌతంగ్ సవాంగ్ వచ్చాక మళ్లీ వాల్యుయేషన్‌కు దురాలోచనకు తెరలేపారు
  • వాల్యుయేషన్‌ను దాచిపెట్టి మళ్లీ రెండోసారి చేయాలని నిర్ణయంచారు
  • మొదటి తప్పు ఏంటంటే.. డిజిటల్ వాల్యుయేషన్ చేయడం
  • డిజిటల్ వాల్యుయేషన్ చేశాక మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది
  • మాన్యువల్ వాల్యుయేషన్ తొక్కిపెట్టి మళ్లీ మరోసారి చేశారు
  • రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టుకు చెప్పారు
  • వాల్యుయేషన్ జరిగిందనడానికి ఆధారాలు ఇస్తున్నాం
  • మాన్యువల్ వాల్యుయేషన్‌కు వచ్చిన వారి ఖర్చులకు రూ.20 లక్షలు పెట్టారు
  • ఆవాస రిసార్ట్‌కు రూ.20 లక్షలు చెల్లించినట్లు బిల్లులు ఉన్నాయి
  • స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుంచి కానిస్టేబుళ్లను తీసుకొచ్చారు
  • ఫిబ్రవరి 2022లో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేస్తామనలేదా?
  • సొంత పత్రిక సాక్షిలో కూడా కథనాలు రాసింది నిజం కాదా?
  • ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు అక్రమాల్లో భాగస్వామి
  • వాల్యుయేషన్ ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారు
  • తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల కోసం అక్రమాలకు పాల్పడ్డారు
  • అందుకు తగ్గట్టుగా చైర్మన్ స్థాయిలో ఉన్న గౌతమ్ సవాంగ్ వ్యవహరించారు
  • ఇన్ని అక్రమాలకు తావిచ్చిన సవాంగ్ ఐపీఎస్‌కు అనర్హుడు
  • 2022 మార్చి 25 నుంచి మాన్యువల్ మూల్యంకనం జరిగిందన్నారు
  • రెండుసార్లు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ కూడా ఇచ్చారు
  • ఏపీపీఎస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారు
  • ఒకసారి వాల్యూయేషన్ అయ్యాక రెండోసారి ఎలా చేస్తారు?
  • సీతారామాంజనేయులే రెండోసారి వాల్యూయేషన్ జరపాలని లేఖ రాశారు
  • పైగా రెండోసారి వాల్యూయేషన్ చేయలేదని కోర్టులకు చెప్పారు
  • గ్రూప్-1 అక్రమాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి
  • ఏపీపీఎస్సీ చైర్మన్ సహా ఉన్న వారందరిని తప్పించాలి
  • గ్రూప్-1 అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలి
  • టీడీపీ హయాంలో ఒక్క విమర్శ కూడా రాకుండా గ్రూప్ పరీక్షలు నిర్వహించాం
  • సవాంగ్, సీతారామాంజనేయులు వీళ్లిద్దరూ దోషులే
  • సవాంగ్, సీతారామాంజనేయులు వద్ద నుంచి ఐపీఎస్ హోదాను వెనక్కి తీసుకోవాలి
  • జగన్, సజ్జల, సవాంగ్, సీతారామాంజనేయులు, ధనుంజయరెడ్డి దీనికేం చెబుతారు?
  • దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే నాశనమే. ఏపీపీఎస్సీ కాస్త.. జేపీపీఎస్సీగా మరింది
RELATED ARTICLES

Most Popular

న్యూస్