Saturday, March 14, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సిఎంకు బాధ్యత లేదు : చంద్రబాబు

సిఎంకు బాధ్యత లేదు : చంద్రబాబు

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ ను సమర్ధించడంలో అర్ధంలేదన్నారు. వైసిపి ప్రభుత్వం సమస్యల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుందన్నారు. తలకాయ ఉన్నవారు, బుద్ధి ఉన్నవారెవరైనా గెజిట్ ను స్వాగతిస్తారా అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టుల విషయంలో గెజిట్ ను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే మరిన్ని విషయాలు మాట్లడతానని బాబు అన్నారు. బచావత్ కు, ట్రిబ్యునల్ కు ఉన్న వ్యత్యాసాలను పరిశీలించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజేలేని పోరాటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

విజయవాడ  రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని చంద్రబాబు పరామర్శించారు.  అర్జునుడు ఆరోగ్య వివరాలు వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్న చంద్రబాబు

ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పిన వైద్యులు బాబుకి వివరించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి దేవినేని ఉమా, కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే ఉమ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular