Saturday, November 23, 2024
HomeTrending Newsబాబుకు ఆ అర్హత లేదు: సజ్జల

బాబుకు ఆ అర్హత లేదు: సజ్జల

చంద్రబాబు చేసిన అప్పులవల్లే రాష్ట్రంపై ఆర్ధిక భారం పడిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు చంద్రబాబు లేదని అయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

2015 ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం లీటర్ పెట్రోల్ పై వ్యాట్ ను 4 రూపాయల మేర పెంచారని, అప్పుడు ఎలాంటి ఆర్ధిక సంక్షోభం కరోనా లాంటి పరిస్థితులు లేకపోయినా ఆ స్థాయిలో పెంచారని  గుర్తు చేశారు. ప్రజల్లో ఆగ్రహం చూసి 2018 లో దీన్ని 2 రూపాయలు తగ్గించారన్నారు. బాబు ప్రభుత్వం నాలుగుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారన్నారు.  ఇంధన ధరల పెంపుపై ధర్నా కు పిలుపు ఇచ్చే అర్హత చంద్రబాబుకు లేదన్నారు సజ్జల.  పెట్రోలు ధరలపై బాబుకు ధైర్యముంటే కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు.

కరోనా కారణంగా ౩౦ వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని, కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆడుకోవడానికి, వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మరో 30 కోట్ల వరకూ ఖర్చు పెట్టామని మొత్తం 60 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడిందన్నారు.  రోడ్ల మరమ్మతుల కోసం కిలో మీటర్ కు ఒక రూపాయి సెస్ మాత్రం విధించామని వివరించారు.  చంద్రబాబు అధికారంలో లేని విరహాన్ని కొన్ని మీడియా సంస్థలు తట్టుకోలేకపోతున్నాయని, అందుకే మళ్ళీ బాబును అర్జెంటుగా సిఎం పీఠంపై కూర్చోబెట్టాలని ప్రయత్నాలు చేసున్నాయని ఆరోపించారు.

అమరరాజా బ్యాటరీస్ నుంచి వెలువడే విష పదార్ధాలు వాతావరణ, నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని, అక్కడి ప్రజల ఆరోగ్యాన్ని విష తుల్యం చేసున్నాయని సజ్జల వివరించారు. 55  మంది స్థానిక ప్రజలను పరీక్షిస్తే 41 మందికి ఆ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్ధాల వల్ల రక్తంలో ప్రభావం పడినట్లు తేలిందన్నారు. అందుకే ప్రభుత్వమే వారిని వెళ్ళిపోవాలని చెప్పిందన్నారు. దీనిపై కూడా ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందన్నారు. అయినా ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, కాలుష్య నియంత్రణ మందని శాస్త్రీయంగా ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటోందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్