Wednesday, March 11, 2026
HomeTrending Newsవైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు

వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు..

వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మూడు నెలలుగా ఎన్నికల కార్యక్రమాలతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. ఇటీవలే పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. జూన్ 4 న కౌంటింగ్ జరగనుంది. కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు.

కుటుంబంతో కొన్ని రోజులు గడపటంతో పాటు సాధారణ వైద్య పరీక్షలు చేయించుకునేందుకే ఆయన అమెరికా వెళ్ళారని తెలుస్తోంది. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఇప్పటికే ఆయన కుమారుడు లోకేష్ తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular