Tuesday, February 25, 2025
HomeTrending Newsఉమ్మడి మేనిఫెస్టోపై బాబు-పవన్ చర్చలు

ఉమ్మడి మేనిఫెస్టోపై బాబు-పవన్ చర్చలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ సాదర స్వాగతం పలికారు. దాదాపు రెండు గంటల పాటు వీరి భేటీ జరిగింది. ఏపీ అసెంబ్లీ తో పాటు లోక్ సభ సాధారణ ఎన్నికలు రెండు నెలలపాటు ముందస్తుగా వస్తాయన్న వార్తల నేపథ్యంలో వీరి కలయికకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, తాజా పరిస్థితులపై చర్చ, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడిగా బహిరంగసభల‌ నిర్వహణలాంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. మరో వైపు ఎల్లుండి బుధవారం విజయనగరం జిల్లాలో జరిగే నారా లోకేష్ యువ గళం పాదయాత్రకు జన సేనానిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

సీట్ల సర్దుబాటు కూడా ఓ కొలిక్కి వచ్చాయని, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై ఓ ప్రాథమిక అవగాహనకు వచ్చారని సమాచారం. చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ల ఫొటోలతో ముద్రించిన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్