Saturday, January 18, 2025
HomeTrending Newsచంద్రబాబుది ఎప్పుడూ అడ్డదారే: సిఎం జగన్

చంద్రబాబుది ఎప్పుడూ అడ్డదారే: సిఎం జగన్

ఇవి జగన్‌ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని, పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్‌ ది పేదల పక్షం అని గర్వంగా చెబుతున్నానని, కాబట్టి మీ ప్రతి ఓటూ మీకు మీరుగా మీ కుటుంబంగా, వచ్చే ఐదేళ్లూ ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుందని… మీకు, మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా? లేదా అని మీరు వేసే ఓటు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. “మరో ఐదు వారాల్లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో జగన్‌కు ఓటు వేస్తే జరిగే ప్రతి మంచీ కూడా కొనసాగింపు. అదే చంద్రబాబుకు వేస్తే జగన్‌ తెచ్చిన పథకాలన్నీ ముగింపు, మోసపోవటం. అందుకే బాగా ఆలోచించండి. ఓటు వేసే ముందు ప్రతి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఆలోచించండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా పొదిలి సమీపంలోని కొనకనమెట్ల క్రాస్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.

జగన్ మాట్లాడుతూ….

  • చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారే. రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి.
  • ఈ పెద్దమనిషికి ఎప్పుడూ కూడా విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియదు.
  • ఆయన మార్క్‌ రాజకీయం ఏమిటంటే, వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు.
  • ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా?
  • అవ్వాతాతలకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదవారికి వాలంటీర్లు పెన్షన్‌ ఇవ్వకూడదట. అలా వెళ్లటం నేరమట.
  • ఇదీ చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌ తో ఎలక్షన్‌ కమిషన్‌ తో ఫిర్యాదు చేయించినది.
  • తన 14 ఏళ్ల పాలనలో ఏనాడూ ఇంటికి పెన్షన్‌ ఇవ్వని ఈ చంద్రబాబు కుట్రలతోనూ, అక్కసుతోనూ ఆపించాడు.
  • కాబట్టే ఈరోజు చంద్రబాబును నేను అడుగుతున్నా, ఈ దొంగల ముఠాను నేను అడుగుతున్నాను. శాడిస్ట్‌ అంటే ఎవరు అని? శాడిజం అంటే ఏమిటి అని?
  • ఇదే పెద్ద మనిషి చంద్రబాబును అడుగుతున్నా.. అయ్యా చంద్రబాబూ శాడిస్ట్‌ అంటే ఎవరు? శాడిజం అంటే ఏమిటి?
  • ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేని వాడు శాడిస్ట్‌ అంటే. పేదవాడు పెద్దవాడు అవుతుంటే ఓర్వలేని వాడు శాడిస్ట్‌ అంటే.
  • ఆ చంద్రబాబు తన హయాంలో తాను పెట్టుకున్న జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుంటూ, వివక్ష చూపుతూ ఆ ఇచ్చే అరకొర రూ.1000 పెన్షన్‌ కూడా ఎక్కడికెక్కడికో వెళ్లి పెద్ద పెద్ద క్యూలలో నిలబడి రోజులతరబడి ఎదరుచూస్తూ నరకయాతన పడిన రోజులు ఆ చంద్రబాబు నాయుడు పాలనలో జన్మభూమి కమిటీల మధ్య జరిగిన పాలన.
  • దానిని మనం మారుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఇంటికే వచ్చి తీసుకొచ్చిన మన వాలంటీర్‌ వ్యవస్థ ఎంత బాగా పని చేస్తోందంటే.. చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్‌ వ్యవస్థ రైళ్లు పరుగెత్తే విధంగా పని చేస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నాడు
  • ఈసారి ఎన్నికల్లో మోసం చేసే ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెబుతూ 175కు 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు మొత్తం 200కు 200 డబుల్‌ సెంచరీ కొట్టేందుకు సిద్ధమేనా? దేవుడి దయతో మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మరో రెండు నెలల్లో మీ బిడ్డ మళ్లీ జగన్‌ అనే నేను… మళ్లీ మీ దగ్గరికి ఇంతకన్నా గొప్ప విజయంతో, దేవుడి ఆశీస్సులతో ఇంతకన్నా గొప్పగా మీ అందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం దేవుడు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను.
RELATED ARTICLES

Most Popular

న్యూస్