Monday, November 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్జంబో బోర్డు దారుణం: చంద్రబాబు

జంబో బోర్డు దారుణం: చంద్రబాబు

అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ అవసరాలకోసం వాడుకోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 81 మందితో జంబో బోర్డును ఏర్పాటు చేశారని, ఇది సరికాదని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్నారు. ఈ మేరకు అయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

కేవలం వ్యాపార ధోరణితోనే బోర్డు కూర్పు ఉందని, పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం బాధాకరమన్నారు. భక్తిభావం ఉన్నవారికి, స్వామివారి సేవలో తరించేవారికి బోర్డులో స్థానం కల్పించాలని, అవినీతిపరులకు చోటు కల్పించడాన్ని ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ బోర్డు ఏర్పాటులో కేవలం స్వార్ధ ప్రయోజనాలు తప్ప మరొకటి కనిపించడంలేదన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై ఆలోచించాలని, శ్రీవారి ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయవద్దని చంద్రబాబు సిఎం జగన్ కు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్