Saturday, November 23, 2024
HomeTrending Newsదమ్ముంటే బహిరంగ చర్చకు రా: జగన్ కు బాబు సవాల్

దమ్ముంటే బహిరంగ చర్చకు రా: జగన్ కు బాబు సవాల్

నిన్న రాప్తాడు సిద్ధం సభలో సిఎం జగన్ తమపై చేసిన ఆరోపణలకు టిడిపి అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. విధ్య్వంసం పాలనపై బహిరంగచర్చకు తాము సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఎక్స్ వేదికగా ఓపెన్ ఛాలెంజ్ అంటూ జగన్ ను నేరుగా ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

“OPEN CHALLENGE! సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి….బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి….విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి….ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది…ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది. బూటకపు ప్రసంగాలు కాదు…అభివృద్ది పాలన ఎవరిదో….విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం…నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా….దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ!” అంటూ పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్