Tuesday, March 17, 2026
HomeTrending Newsప్రజలకు మేలు జరగాలి: బాబు

ప్రజలకు మేలు జరగాలి: బాబు

New Year wishes: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతలు, చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. పలువురు నేతలు చంద్రబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

“రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. కష్టాల‌న్నీ తొల‌గిపోయి 2022 లో ప్ర‌జ‌ల‌కు అంతా మేలు జరగాల‌ని, అన్ని రంగాల‌లో అభివృద్ది జ‌రిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను” అంటూ చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ప్రజలకు శుబాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular