Thursday, March 12, 2026
HomeTrending Newsఆత్మకూరుకు ఆనం, కోవూరుకు ప్రశాంతి రెడ్డి : 34 మందితో టిడిపి రెండో జాబితా

ఆత్మకూరుకు ఆనం, కోవూరుకు ప్రశాంతి రెడ్డి : 34 మందితో టిడిపి రెండో జాబితా

తెలుగుదేశం పార్టీ 34 మందితో కూడిన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ వివరాలను సోషల్ మీడియా  ద్వారా వెల్లడించారు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దెందులూరుకు చింతమనేని ప్రభాకర్ పేర్లను ప్రకటించారు. తొలి జాబితాలో వీరిద్దరి పేర్లు లేకపోవడం సదరు నేతల అభిమానులను ఆందోళనకు గురిచేసింది.

“వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మీ ముందుకు తెచ్చాం. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే, ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను” అంటూ బాబు విజ్ఞప్తి చేశారు.

అభ్యర్ధుల వివరాలు:

  1. నరసన్నపేట: బొగ్గు రమణ మూర్తి
  2. గాజువాక: పల్లా శ్రీనివాస రావు
  3. చోడవరం – కేఎస్ఎన్ఎస్ రాజు
  4. మాడుగుల – పైలా ప్రసాద్
  5. ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ
  6. రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్
  7. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  8. రంపచోడవరం (ఎస్.టి) – మిర్యాల శిరీష
  9. కొవ్వూరు (ఎస్సీ) – ముప్పిడి వెంకటేశ్వర రావు
  10. దెందులూరు – చింతమనేని ప్రభాకర్
  11. గోపాలపురం (ఎస్సీ) – మద్దిపాటి వెంకట రాజు
  12. 12 పెద్దకూరపాడు – భాష్యం ప్రవీణ్
  13. గుంటూరు వెస్ట్ – పిడుగురాళ్ళ మాధవి
  14. గుంటూరు ఈస్ట్ – మహమ్మద్ నజీర్
  15. గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
  16. కందుకూరు – ఇంటూరి నాగేశ్వర రావు
  17. మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి
  18. గిద్దలూరు – అశోక్ రెడ్డి
  19. ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి
  20. కోవూరు – వేమిరెడ్డి ప్రశాంతి
  21. వెంకటగిరి – కురుగొండ్ల లక్ష్మి ప్రియ
  22. కమలాపురం- పుత్తా చైతన్య రెడ్డి
  23. ప్రొద్దుటూరు – ఎన్. వరదరాజులు రెడ్డి
  24. నందికొట్కూరు (ఎస్సీ) – గిత్తా జయసూర్య
  25. ఎమ్మిగనూరు – జయనాగేశ్వర్ రెడ్డి
  26. మంత్రాలయం – రాఘవేంద్ర రెడ్డి
  27. పుట్టపర్తి – పల్లె సింధూర రెడ్డి
  28. కదిరి – కందికంటి యశోదా దేవి
  29. మదనపల్లి – షాజహాన్ భాషా
  30. పుంగనూరు – చల్లా రామచంద్రా రెడ్డి
  31. చంద్రగిరి – పులివర్తి నాని
  32. శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి
  33. సత్యవేడు (ఎస్సీ) – కోనేటి ఆదిమూలం
  34. చిత్తూరు (ఎస్సీ) – డా. కలికిరి మురళీ మోహన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular