Sunday, January 19, 2025
HomeTrending Newsసభా సాక్షిగా చంద్రబాబు శపథం

సభా సాక్షిగా చంద్రబాబు శపథం

Babu walked Out:  
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం ప్రకటించారు. నేడు అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు ఇకపై అసెంబ్లీలో అడుగుపెట్టనని, మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే సభకు వస్తానని శపథం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నానంటూ సభలో సభ్యులందరికీ నమస్కారం చేస్తూ వెళ్ళిపోయారు.

అధికార పార్టీలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూడా… గతంలో ఎన్నడూ ఇలాంటి అనుభవాలు తాను చూడలేదని, రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలను భరించానని, నిన్న కూడా… కుప్పం ఓటమి తర్వాత తన మొహం చూడాలని ఉందంటూ సిఎం జగన్ వ్యాఖ్యానించినా తాను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఏ పరువు కోసం ఇన్ని సంవత్సరాలుగా తానూ పని చేశానో… తన కుంటుంబం, తన భార్య విషయాలు ఇక్కడ ప్రస్తావించారని ఆవేదన వ్యక్తం చేశారు.  అందుకే ఇకపై సభలో ఉండబోనని ప్రతిజ్ఞ చేశారు.

అంతకుముందు వ్యవసాయంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతుండగా…. విపక్ష సభ్యులు ‘గంట- అరగంట’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాంబాబు ఇలా మాట్లాడితే మాధవరెడ్డి అంశాలను కూడా ప్రస్తావిద్దామని బదులిచ్చారు. దీనిపై బాబు కలత చెందారు.

Also Read :  ఇప్పటికైనా బాబుకు జ్ఞానోదయం: జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్