Monday, February 24, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్మాన్సాస్ పై తీర్పు హర్షణీయం: చంద్రబాబు

మాన్సాస్ పై తీర్పు హర్షణీయం: చంద్రబాబు

ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి నియామకాన్ని రద్దు చేస్తూ, చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు స్పందించారు. మాన్సాస్ ట్రస్టు కేసులో హైకోర్టు తీర్పు హర్షణీయమని పేర్కొన్నారు. కోర్టు తీర్పు వేల మంది ఉద్యోగులకు అండగా నిలిచిందని తెలిపారు. అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదన్న విషయం తాజా తీర్పుతో వెల్లడైందని పేర్కొన్నారు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి స్పష్టమైందని అన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలోని వేలాది భూముల్ని కొల్లగొట్టాలన్న జగన్ దుర్మార్గ ఆలోచనలకు అడ్డుకట్ట పడిందన్నారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి కోర్టులో ఇన్నిసార్లు తలదించుకున్నది లేదని చంద్రబాబు విమర్శించారు. ఇకనైనా ముందు వెనుకలు ఆలోచించకుండా జీవోలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. ట్రస్టును కాపాడుకున్నారంటూ అశోక్ గజపతిరాజుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్