Sunday, January 19, 2025
Homeసినిమాచరణ్‌ 15 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

చరణ్‌ 15 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ చరణ్, శంకర్ ల క్రేజీ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి, ఎస్.జే. సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా చరణ్‌ రెండు విభిన్న పాత్రలు పోషిస్తుండడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్‌ చేస్తున్న మూవీ కావడం.. అలాగే శంకర్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ స్ట్రైయిట్ మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

అయతే.. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు అరవై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది కానీ.. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. దీంతో అభిమానులతో పాటు పాన్ ఇండియా ఆడియెన్స్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూయర్ కి రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ.. రిలీజ్ చేయలేదు. ఆతర్వాత సంక్రాంతికి ఫస్ట్ లుక్ వస్తుందని ఎదురు చూశారు అయినా రాలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు కానీ.. అప్పుడు కూడా రిలీజ్ చేయడం లేదని తెలిసింది.

మరి.. చరణ్‌ 15 ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే.. మార్చి 27 చరణ్‌ పుట్టినరోజు. ఈ రోజున ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని తెలిసింది. త్వరలో మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ మూవీ చరణ్‌ 15వ చిత్రం కాగా.. దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ లో ఈ భారీ పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది. మరి.. ఈ సినిమాతో చరణ్, శంకర్ కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్