Sunday, January 19, 2025
Homeసినిమాచరణ్‌, బుచ్చిబాబు మూవీ మరింత ఆలస్యం?

చరణ్‌, బుచ్చిబాబు మూవీ మరింత ఆలస్యం?

‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ సాధించిన  డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా చేసేందుకు స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్ ఇంట్రస్ట్ చూపించారు. అయితే.. బుచ్చిబాబు మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనే తరువాత సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఎన్టీఆర్ కోసం డిఫరెంట్ స్టోరీలు రెడీ చేశాడు. ఎన్టీఆర్  కూడా ఒకే  చెప్పడంతో కథపై వర్క్ చేస్తూవచ్చాడు. అయితే.. ఏమైందో కానీ.. బుచ్చిబాబుతో ఇప్పట్లో సినిమా చేయలేనని ఎన్టీఆర్ చెప్పేశారు.

దీంతో బుచ్చిబాబు ఈ  స్టోరీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చెప్పడంతో ఆయన ఒకే అన్నారు. ఈ ప్రాజెక్ట్ ను ఇటీవల అఫిషియల్ గా అనౌన్స్ చేశారుకూడా. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సతీష్ కిలారు అనే నూతన నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత బుచ్చిబాబుతో సినిమా స్టార్ట్ చేస్తాడు అనుకుంటే.. ఇప్పుడు బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఇప్పట్లో లేదనే వార్త బయటకు వచ్చింది.

చరణ్‌.. కన్నడ డైరెక్టర్ నర్తన్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఈ మూవీని యువి క్రీయేషన్స్ సంస్థ నిర్మించనుంది. అయితే.. ఈ మూవీని శంకర్ మూవీ తర్వాత చేయాలనుకుంటున్నారట. శంకర్ తో చేస్తున్న మూవీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత చరణ్ నర్తన్ తో చేయనున్నారు. ఆతర్వాత బుచ్చిబాబుతో సినిమా చేస్తారట. ఈ లెక్కన బుచ్చిబాబు చరణ్ తో మూవీ కోసం వెయిట్ చేయక తప్పదు. ఎన్టీఆర్ కోసం వెయిటింగ్ తప్పలేదు.. ఇప్పుడు చరణ్ కోసం.. పాపం బుచ్చిబాబు.

Also Read : చరణ్‌ కోసం రంగంలోకి దిగిన సల్మాన్. 

RELATED ARTICLES

Most Popular

న్యూస్