Sunday, January 19, 2025
Homeసినిమాగౌత‌మ్ తో సినిమాపై చ‌ర‌ణ్‌ క్లారిటీ

గౌత‌మ్ తో సినిమాపై చ‌ర‌ణ్‌ క్లారిటీ

Gowtham movie: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో అద్భుతంగా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ముఖ్యంగా నార్త్ లో చ‌ర‌ణ్ కు మంచి పేరు.. మంచి క్రేజ్ ను తీసుకువ‌చ్చింది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఆచార్య సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు చ‌ర‌ణ్. ఈ సినిమా ఈ నెల 29న విడుద‌ల‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియా ముందుకు వ‌చ్చిన చ‌ర‌ణ్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకున్నారు.
ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత జెర్సీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరితో సినిమా చేయ‌నున్నారు. అయితే.. జెర్సీ చిత్రాన్ని గౌత‌మ్ హిందీలో రీమేక్ చేయ‌డం.. అక్క‌డ ప్లాఫ్ అవ్వ‌డం జ‌రిగింది. దీంతో గౌత‌మ్ తో చ‌ర‌ణ్ మూవీ ఉండ‌దు అనే ప్ర‌చారం మొద‌లైంది. దీని గురించి చ‌ర‌ణ్ అని అడిగితే.. శంక‌ర్ సార్ తో చేస్తున్న సినిమా త‌ర్వాత గౌత‌మ్ తో సినిమా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు.
అంతే కాకుండా… ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతుందనే టాక్ వచ్చింది కానీ.. ఈ కథ స్పోర్ట్స్ నేపథ్యానికి సంబంధించినది కాదు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ డ్రామాగా సాగుతుంది అంటూ స్పష్టం చేశాడు. ఈ సినిమాలో కథానాయికలుగా రష్మిక .. కృతి శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఎవ‌ర్ని ఫైన‌ల్ చేయ‌లేద‌ని తెలిసింది. శంక‌ర్ తో చేస్తున్న మూవీ కంప్లీట్ అయిన త‌ర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. మ‌రి.. శంక‌ర్, గౌత‌మ్ ల‌తో చేసే సినిమాల‌తో చ‌ర‌ణ్ వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధిస్తాడేమో చూడాలి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్