Sunday, March 15, 2026
Homeసినిమాచరణ్‌ సినిమా ఆ ఇద్దరిలో ఎవరితో?

చరణ్‌ సినిమా ఆ ఇద్దరిలో ఎవరితో?

రామ్ చరణ్‌ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో సంచలన విజయం సాధించాడు. ఆతర్వాత ‘ఆచార్య’ మూవీలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. కొరటాల దర్శకత్వంలో రూపొందిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం చరణ్‌ ఆశలన్నీ శంకర్ తో చేస్తున్న సినిమా పైనే. ఈ మూవీ సాఫీగా జరుగుతుంది అనుకుంటే.. శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్ చేయాల్సి రావడంతో చరణ్‌ మూవీకి బ్రేక్ పడింది. ఈ గ్యాప్ తో గౌతమ్ తిన్ననూరితో సినిమా చేద్దామనుకుంటే.. చిరంజీవి కథ విని సున్నితంగా తిరస్కరించారు.

దీంతో చరణ్ శంకర్ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. రామ్ చరణ్ ప్రస్తుతం ఇద్దరు దర్శకుల వైపు చూస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో మొదటగా సుకుమార్ వైపు కాగా మరో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సుకుమార్ తో చరణ్‌ ‘రంగస్థలం’ సినిమాను చేశాడు. ప్రస్తుతం’ పుష్ప 2′ సినిమా పనిలో ఉన్న సుకుమార్ వచ్చే ఏడాది చివరి వరకు అదే సినిమా పనిలో ఉంటాడు. ఇక త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబుతో ప్రస్తుతం చేస్తున్న సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల అయ్యే అవకాశం ఉంది. కనుక రామ్ చరణ్, త్రివిక్రమ్ ఒకేసారి ఖాళీ అవుతారు. దాంతో ఇద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు లేక పోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు చరణ్‌ నెక్ట్స్ మూవీ కోసం కథలు వింటున్నారు. ఎవరైనా చరణ్‌ ను కథతో మెప్పిస్తారో.?  లేక సుకుమార్, త్రివిక్రమ్ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేస్తాడో అనేది ఆసక్తిగా మారింది. మరి.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular