మెగా పవర్ స్టార్, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఏప్రిల్ 13న యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా రామ్ చరణ్ ఈ గౌరవాన్ని పరిశోధక విద్యార్థులతో కలిసి అందుకున్నారు. సీనిరంగంలో చరణ్ చేసిన సేవలకు గిర్తిమ్పుగా ఈ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వెల్స్ యూనివర్సిటీ పేర్కొంది.
చరణ్ కు దక్కిన ఈ గౌరవంపై తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా తమ హర్షం వ్యక్తం చేస్తూ గ్లోబల్ స్టార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు,