Wednesday, March 18, 2026
Homeసినిమా'ఆర్సీ 15' అప్ డేట్ కి ముహుర్తం ఫిక్స్?

‘ఆర్సీ 15’ అప్ డేట్ కి ముహుర్తం ఫిక్స్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది చరణ్‌ 15వ చిత్రం కాగా, దిల్ రాజు 50వ చిత్రం కావడం విశేషం.  ఇందులో చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి, ఎస్.జె.సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే.. ఈ సినిమా గురించి అఫిషియల్ గా ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుండి న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని అనౌన్స్  చేస్తారనే వార్తలు రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. కాగా దీని పై మూవీ యూనిట్ నుండి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రావలసి ఉంది.

జనవరి ఫస్ట్ వీక్ లో జరిగే షెడ్యూల్ లో చరణ్‌ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ రెండు పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయని తెలిసింది. ఇప్పటి వరకు అరవై శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఇక నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అప్ డేట్ జనవరి 1 కుదరకపోతే సంక్రాంతికి అయినా వస్తుందని సమాచారం. మరి.. శంకర్ తెలుగులో ఫస్ట్ టైమ్ చేస్తున్న ఈ మూవీతో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular