లైగర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడి భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో పూరి, ఛార్మి ల పై నెటిజన్ లు కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో సోషల్ మీడియాకు కొంత కాలం బ్రేకిస్తున్నానని మళ్లీ బౌన్స్ బ్యాక్ అయి రెట్టించిన వేగంతో వస్తామని ప్రకటించి ఛార్మి సోషల్ మీడియాకు దూరంగా వుంది.
అయితే.. జనగణమన సినిమా ఆగిపోయిందని ప్రచారం మొదలైంది. అంతే కాకుండా.. పూరి మకాం ముంబాయి నుంచి హైదరాబాద్ కి మార్చారని మరో వార్త వచ్చింది. ఇక తాజాగా పూరి, ఛార్మి మధ్య బ్రేకప్ అయ్యిందని మరో వార్త బయటకు వచ్చింది. ఇలా వార్తలు రావడంతో బాగా ఫీలయ్యింది అనుకుంటా.. రూమర్స్ ..రూమర్స్ రూమర్స్.. అన్ని రూమర్స్ ఫేక్ !. కేవలం పూరి కనెక్ట్స్ పై దృష్టి సారిస్తున్నాను. అయితే పుకార్లకు రెస్ట్ ఇన్ పీస్!!’ అంటూ రూమర్స్ పై ఛార్మీ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది.
అయితే… ఛార్మి జనగణమన ఆగిపోయిందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిందా? లేక తాను పూరితో విడిపోతున్నానని పూరి కనెక్ట్స్ నుంచి విడిపోతున్నానని వస్తున్న వాటిపై స్పందించిందా?.. లేక లైగర్ ఫ్లాప్ కారణంగా పూరి ముంబై ఆఫీస్ ఖాలీ చేస్తున్నాడని వస్తున్న వార్తల పై రిప్లై ఇచ్చిందా? అనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి వుంంది. మరి.. ఛార్మి మరోసారి స్పందించి క్లారిటీ ఇస్తుందేమో..?
Also Read : ‘లైగర్’ ఫ్లాప్ – సోషల్ మీడియాకు బ్రేక్