Wednesday, March 18, 2026
Homeసినిమావరలక్ష్మీ 'ఛేజింగ్’ టీజర్ విడుదల

వరలక్ష్మీ ‘ఛేజింగ్’ టీజర్ విడుదల

Chasing: టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘చేజింగ్’. కె. వీరకుమార్ కథ, దర్శకత్వం అందించిన ఈ చిత్రాన్ని జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.  పరిటాల రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా  టీజర్‌ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రముఖ దర్శకులు వి. సముద్ర, సూర్యకిరణ్, నిర్మాత రామసత్యనారాయణ సంయుక్తంగా ఈ టీజర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ “వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో నేను కూడా పని చేశాను. మంచి టాలెంటెడ్ పర్సన్. ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి విజయం సాధిస్తున్నాయి. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించి, టీమ్‌కి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను’’ అన్నారు.

నిర్మాత రామసత్యన్నారాయణ మాట్లాడుతూ ‘‘నిర్మాతలు కొత్తవారైనా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబుగారు మంచి అనుభవజ్ఞుడు. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుంది.. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు” తెలిపారు.

దర్శకుడు సూర్యకిరణ్ మాట్లాడుతూ “ఈ సినిమాని నేను చూశా.  చాలా రిచ్‌గా తీశారు. విజువల్స్ చాలా బాగున్నాయి. పరిటాల రాంబాబుగారి గురించి చెప్పాలంటే.. వాళ్ల అబ్బాయి అండర్ 19 క్రికెట్‌లో ఉన్నారు. అతని కంటే కూడా రాంబాబు చాలా స్పీడ్‌గా ఉంటారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular