Thursday, March 19, 2026
HomeసినిమాChatrapathi: 'ఛత్రపతి' యాక్షన్ ట్రైలర్ విడుదల

Chatrapathi: ‘ఛత్రపతి’ యాక్షన్ ట్రైలర్ విడుదల

శ్రీనివాస్ బెల్లంకొండ, పెన్ స్టూడియోస్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘ఛత్రపతి’ తో బాలీవుడ్‌లో గ్రాండ్ డెబ్యూ చేస్తున్నాడు.  రాజమౌళి బ్లాక్‌బస్టర్ ఛత్రపతికి రీమేక్ గా అదే టైటిల్ తో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రూపొందించారు. వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా పవర్ ప్యాక్డ్ టీజర్ భారీ బజ్‌ని క్రియేట్ చేసింది. మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో  పొరుగు దేశంలో అల్లర్ల తర్వాత పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన తన తల్లి, తమ్ముడి కోసం వెతుకుతుంటాడు.

అతను తన ప్రజల హక్కుల కోసం పోరాడటానికి  పవర్ ఫుల్ వ్యక్తులకు వ్యతిరేకంగా వెళ్తాడు. తల్లి తుపాకీతో కథానాయకుడిని కాల్చి చంపడంతో ట్రైలర్ పూర్తయింది. సినిమా బ్యాక్‌డ్రాప్‌ని మార్చి దర్శకుడు వివి వినాయక్ ఛత్రపతిని యాక్షన్‌ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. యాక్షన్ ధమకేదార్ ట్రైలర్ మాస్ కి పండగలా వుంది. టైటిల్ రోల్‌లో శ్రీనివాస్ బెల్లంకొండ రగ్డ్ అండ్ మాస్‌గా కనిపించాడు. తన పాత్రని చాలా యీజ్ తో చేశారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ అద్భుతంగా నటించాడు. తల్లీ కొడుకుల ఎమోషన్ ఆకట్టుకున్నాయి.  నుష్రత్ భరుచ్చా హీరోయిన్ పాత్రలో  గ్లామరస్‌గా కనిపించింది.

నిజార్ అలీ షఫీ సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా ఉంది. తనిష్క్ బాగ్చి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మాస్ , యాక్షన్ సైడ్‌ని ఎలివేట్  చేసింది.  పెన్ స్టూడియస్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. విమర్శకుల ప్రశంసలు పొందిన, కమర్షియల్ గా విజయవంతమైన చిత్రాలను రూపొందించడంలో పేరుపొందిన పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు  ధవల్ జయంతిలాల్ గడా  ,అక్షయ్ జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌ తో ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మిస్తున్నారు. ఒరిజినల్‌కి కథను అందించిన రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్‌ రీమేక్ వెర్షన్‌కి రచయిత. భారతదేశంలోనే అత్యంత బిజీ టెక్నీషియన్లలో ఒకరైన సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి మయూర్ పూరి డైలాగ్స్ అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular