తిరుమల నడకమార్గంలో చిరుత ఓ చిన్నారిని గాయపరిచింది. ఏడవ మైలు వద్ద ఐదు సంవత్సరాల బాలుడిని చిరుతపులి ఎత్తుకెళ్ళింది. సమీపంలో విధులో వున్న పోలిసులు దీన్ని గమనించి గట్టిగా కేకలు వేయడంతో ఆ చిరుత బాలుడిని వదిలేసి వెళ్ళింది.
గాయ్యాలు పాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. టిటిడి ఈవో ధర్మారెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని అనంతరం శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. నడక మార్గంలో బాలుడు తాతతో కలిసి వెళుతుండగా చిరుత దాడి చేసిందని ఈవో చెప్పారు.
అయిదుగురు పోలీసులు అరుస్తూ ఫారెస్ట్ లోకి పరిగెత్తారని… భారీగా శబ్దాలు చేయడంతో చిరుత భయపడి బాలుడిని వదిలి వెళ్లిపోయిందని తెలిపారు. సిబ్బంది అప్రమత్తలతోనే బాలుడిని కాపాడగలిగామని వెల్లడించారు. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్టీచారు. నడక మార్గంలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లేలా చూస్తామని వివరించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కాలినడక మార్గంలో భక్తులను యధావిధిగా అనుమతిస్తున్నట్లు ప్రకటించారు..