Wednesday, February 26, 2025
HomeTrending Newsఒంగోలు నుంచి లోక్ సభకు చెవిరెడ్డి పోటీ!

ఒంగోలు నుంచి లోక్ సభకు చెవిరెడ్డి పోటీ!

చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా  లోక్ సభకు పోటీ చేయనున్నారు. గుంటూరు లోక్ సభకు గతంలో  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు వెంకటరమణ ను ప్రకటించగా  ఆయన్ను మార్చి ఉమ్మారెడ్డి అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు ఖరారు చేశారు. పొన్నూరు సమన్వయకర్తగా అంబటి మురళిని వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మల్యేలతో నేడు ఎనిమిదో జాబితాను వైఎస్సార్సీపీ ప్రకటించింది.

గంగాధర నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్థానంలో ఆయన కుమార్తె కళ్ళత్తూరు కృపాలక్ష్మికి టికెట్ ఖరారు చేశారు. ప్రస్తుతం కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ ను కందుకూరు  సమన్వయకర్తగా ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్