Saturday, November 23, 2024
HomeTrending Newsదళితబంధుతో దళితుల్లో వెలుగులు

దళితబంధుతో దళితుల్లో వెలుగులు

2001లో సింహగర్జన చేసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మెదలుపెట్టింది కరీంనగర్ నుండే అన్నారు మంత్రి గంగుల. విజయవంతమైన తెలంగాణ పోరాటం, రైతుబందు మాదిరే దళిత బంధు  సైతం విజయవంతం కావాలనే ఉద్దేశంతోనే కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళితబంధు కార్యక్రమాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తున్నారన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి దళితబందు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. లక్షమందితో నిర్వహించే సభాప్రాంగణంతో పాటు పార్కింగ్ ఏర్పాట్లు ఇతర అన్ని అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ  కేసీఆర్ గారు అమలుచేస్తున్న ఎన్నో గొప్ప పథకాలతో దేశం, రాష్ట్రం గర్వపడుతుందన్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో ఎందరో ముఖ్యమంత్రులు, ప్రధానులు మారినా ఉన్నతవర్గాలకు దీటుగా దళితులు ముందుకు వెల్లాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న సామాజిక మార్పు దళితుల జీవితాల్లో రాలేదన్నారు. ఈ మార్పుకి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబందు పథకాన్ని రూపొందించారన్నారు. ఇంత గొప్ప పథకాన్ని కరీంనగర్ జిల్లాలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్న మంత్రి, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. చాలా మంది దళితబందుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వారనుకుంటున్నట్టు ఎన్నికల కోసం తీసుకొచ్చిన పథకం దళితబందు కాదన్నారు మంత్రి గంగుల. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులపై విశ్వాసం కలగాలంటే, వారు రూపొందించే పథకాలతో ప్రజలకు మేలు కలిగి, వారి జీవితాల్లో వెలుగులు నిండినప్పుడే జరుగుతుందన్నారు మంత్రి గంగుల.

రైతన్నల ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకొని వారికి కావాల్సిన కరెంటు, నీళ్లు, పెట్టుబడిని అందించడం కోసం కాళేశ్వరం వద్ద ఆనకట్ట ద్వారా బీళ్లకు నీళ్లను మల్లించామన్నారు. 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటుతో పాటు రైతుబందు, రైతుబీమా ద్వారా బరోసాను అందించి ఇవాల రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణను సాకారం చేసుకున్నామన్నారు మంత్రి గంగుల. స్వాతంత్ర్య భారత చరిత్రలో ఎక్కడా లేనివిదంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు, కళ్యణలక్ష్మీ, గురుకులాలు వంటి ఎన్నో అధ్బుతమైన పథకాల్ని అందించామన్నారు. స్వరాష్ట్రానికి ముందు దళితులకు విద్య అందలేదని, ఇవ్వాల అనేక గురుకులాలు అత్యధ్బుతమైన విద్యను అందిస్తున్నాయన్నారు. బీసీలకు గతంలో 16 గా ఉన్న గురుకులాల్ని నేడు 261కి పెంచిన ఘనత ప్రభుత్వానిదన్నారు మంత్రి గంగుల.

ఈనెల 16న నిర్వహించబోయే దళితబందు సభకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి సభను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గొప్పగా ఆలోచించి దళితవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబందు కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్నేళ్లలో రాలేదన్నారు. ఈనెల 16న హుజురాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దళితబందు అమలుపై కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సంపూర్ణంగా చర్చించడమే కాక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. పూర్తి సాచ్యురేషన్ మోడ్లో దళితుల కోసం అమలు చేస్తున్న దళిత బందు పథకంలో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదన్నారు కొప్పుల ఈశ్వర్.

ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ లాల్. పోలీస్ ఉన్నతాధికారులతో పాటు అన్ని ముఖ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్