Wednesday, March 11, 2026
HomeTrending Newsదళితబంధు కార్యచరణకు సిఎం కసరత్తు

దళితబంధు కార్యచరణకు సిఎం కసరత్తు

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రేపటి నుంచి  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సిఎం జిల్లాల పర్యటనల వివరాలు

17 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది. ఎసంగిలో పంటలు, వడ్ల కొనుగోలులో కేంద్రం వైఖరి, ప్రతిపక్షాల దూకుడు తదితర అంశాల్ని చర్చించి ఈ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యుహాల్ని నిర్దేశించనున్నారు.

18 వ తేదీ జిల్లా కలెక్టర్ల సమావేశం
శనివారం 18వ తేదిన దళిత బందు ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ అధికారులు పాల్గొంటారు. దళితబంధు అమలు పై సమీక్షించనున్నారు. హుజూరాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల్లో  అమలులోకి వచ్చిన దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో మార్చి లోపు అమలు చేసే అంశంపై సిఎం కెసిఆర్ సమీక్షించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు ప్రజా ప్రతినిధులకు శిక్షణాకార్యక్రమాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అదే సందర్భంలో ధాన్యం సేకరణ అంశం పై సిఎం కెసిఆర్ సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు కూడా పాల్గొననున్నారు.

19 వ తేదీ వనపర్తి జిల్లా పర్యటన
ఆదివారం 19 వ తేదీన ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా.. జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

20 వ తేదీ జనగామ జిల్లా పర్యటన
సోమవారం 20 వ తేదీన జనగామ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

వీటితో పాటు, సిఎం కెసిఆర్ త్వరలోనే మరికొన్ని జిల్లాలు నియోజకవర్గాల పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం పర్యటన చేపట్టనున్నారు. నియోజకవర్గం పరిధిలోని ఉమామహేశ్వర లిఫ్టు మరియు రిజర్వాయర్ కు సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేయనున్నారు. 100 పడకల దవాఖానకు శంఖుస్థాపన చేయనున్నారు.
నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయ ప్రారంభంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వికారాబాద్ జిల్లాపర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రారంభిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే సందర్భంలో జిల్లాల పర్యటనలో భాగంగా ఆయా జిల్లాల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు.

Also Read : తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular