రైతు పక్షపాతి అని చెప్పుకునే కెసిఆర్ ప్రభుత్వానికి తడిచిన ధాన్యం కనిపించట్లేదా అని బిజెపి నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. హుజురాబాద్ ఉపఎన్నికల మీద ఉన్నదృష్టి రైతులు పండించిన ధాన్యం పైన ఎందుకు లేదన్నారు. హుజురాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ పంట నష్టంపై రైతులతో మాట్లాడారు. తక్షణమే రాష్ట్రంలో ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేసి హుజురాబాద్ నియోజకవర్గంలో ధాన్యంతో పాటు తడిచిన ధాన్యాన్ని, ప్రతి గింజను కొనుగోలు చేయాలని రాజేందర్ డిమాండ్ చేశారు.