Saturday, February 22, 2025
HomeTrending Newsనామినేటెడ్ పదవుల్లో విశాఖకు అగ్రతాంబూలం

నామినేటెడ్ పదవుల్లో విశాఖకు అగ్రతాంబూలం

ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో  విశాఖ జిల్లాకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత కల్పించారు. వివిధ కార్పొరేషన్ లకు తొలి ప్రాధాన్యతగా 11మందికి చైర్మన్ పదవులు, మరి కొంతమందికి డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం జీవోలు జారి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

  1. విఎంఆర్ డీఏ చైర్మన్ గా అక్కరమాని విజయనిర్మల ( విశాఖ తూర్పు నియోజకవర్గం)
  2. రాష్ట్ర విద్యావిభాగం వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ (విశాఖ పశ్చిమ)
  3. నెడ్ క్యాప్ చైర్మన్ గా కేకే రాజు (విశాఖ ఉత్తరం)
  4. రాష్ట్రమైనారిటీ విభాగం ఛైర్మన్ గా జాన్ వెస్లీ (విశాఖ దక్షిణం )
  5. రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ ఛైర్మన్ గా దాడి రత్నాకర్ (అనకాపల్లి)
  6. విశాఖ రీజియన్ పెట్రోకారిడార్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ (విశాఖ ఉత్తరం )
  7. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జీవి
  8. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా చింతకాయల సన్యాసిపాత్రుడు (నర్సీపట్నం)
  9. డీసీఎమ్ ఛైర్ పర్సన్ గా పల్లా చినతల్లి (గాజువాక)
  10. రాష్ట్ర బ్రాహ్మణ విభాగం చైర్మన్ గా సుధాకర్‌
  11. డీసీసీబీ ఛైర్మన్ గా సుకుమార్ వర్మ కొనసాగింపు (యలమంచిలి)
RELATED ARTICLES

Most Popular

న్యూస్