Saturday, January 18, 2025
HomeసినిమాVishva Karthikeya: బాలనటుడి నుంచి హీరోగా.. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న విశ్వ కార్తికేయ.!

Vishva Karthikeya: బాలనటుడి నుంచి హీరోగా.. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న విశ్వ కార్తికేయ.!

బాల నటుడిగా కెరీర్ మొదలుపెట్టి విశ్వ కార్తికేయ నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మంది వద్ద చైల్డ్ ఆర్టిస్ట్‌గా పని చేశాడు విశ్వ కార్తికేయ. బాలనటుడిగా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. ఆయన నటించిన చిత్రాల్లో గోరింటాకు, జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, లేత మనసులు, శివ శంకర్, అధినాయకుడు వంటివి ఉన్నాయి. నంది అవార్డు, ఇతర అంతర్జాతీయ అవార్డులు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు సొంతం చేసుకున్నాడు.

‘జై సేన’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వ కార్తికేయ. కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో మంచి నటనను కనబరిచాడు. ఇప్పుడు ‘కలియుగం పట్టణంలో’ అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. నాని మూవీ వర్క్స్ మరియు రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ అధినేతలు డా. కే. చంద్ర ఓబుల్ రెడ్డి, జీ మహేశ్వర రెడ్డి, కట్టం రమేష్  సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే.. Nth Hour అనే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌తో విశ్వ కార్తికేయ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ మూవీ దర్శక నిర్మాణ బాధ్యతలను రాజు గుడిగుంట్ల తీసుకున్నారు. Nth Hour ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్