Sunday, January 19, 2025
HomeTrending Newsనిర్బంధ విద్యతోనే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన - మంత్రి ఎర్రబెల్లి

నిర్బంధ విద్యతోనే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన – మంత్రి ఎర్రబెల్లి

చదువుకునే వయసు పిల్లలు కచ్చితంగా స్కూల్ లో ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యాంగంలో చెప్పినట్లుగా నిర్బంధ విద్యను అందించాలన్నారు. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన గ్రామ బాలల రక్షణ (VCPC – విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ) అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకే రవి శంకర్, రసమయి బాలకిషన్, జెడ్పి చైర్మన్ విజయ, కరీంనగర్ మున్సిపల్ మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాలల రక్షణ కర దీపికను ఆవిష్కరించారు. సర్పంచ్ చైర్మన్ గా, అంగన్వాడి టీచర్ కన్వీనర్ గా, గ్రామ స్కూల్ హెడ్ మాస్టర్, ఎంపీపీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని మంత్రి తెలిపారు. గ్రామ స్థాయిలోనే బాలలను రక్షించాలని ప్రభుత్వం గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి గ్రామంలో ఈ కమిటీలు ఉంటాయని, రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో కమిటీలు వేయాల్సి ఉందని, కరీంనగర్ జిల్లాలోనే 313 కమిటీలు ఉన్నాయన్నారు. బాలల హక్కుల కమిషన్ నుంచి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారని, గ్రామ పంచాయతీ స్థాయిలోనే బాలల రక్షణ జరగాలని మంత్రి అన్నారు. పోలీస్ స్టేషన్, కోర్టుల దాకా వెళ్ళే పరిస్థితి రావద్దని, రాష్ట్ర స్థాయి దాకా సమస్యలు పోవద్దన్నారు. ఈ విషయంలో సర్పంచులు ఆక్టివ్ గా పని చేయాలని, బాలలను కార్మికులుగా, ఇండ్లలో పనులకు పెట్టుకోవడం వంటి వాటిని నివారించాలని అధికారులను ఆదేశించారు.

Also Read : అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి  ఎర్రబెల్లి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్