Saturday, November 23, 2024
HomeTrending Newsపిల్లలకు మంచి ఆరోగ్యానివ్వాలి.. మంత్రి హరీశ్‌రావు

పిల్లలకు మంచి ఆరోగ్యానివ్వాలి.. మంత్రి హరీశ్‌రావు

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో హైదరాబాద్ లో ఈ రోజు గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ 9వేల మందిపై చేసిన సర్వే ఫలితాలను వైద్యారోగ్యశాఖ మంత్రి తాజ్‌ డెక్కన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా హైపర్‌ టెన్షన్‌ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ఐ ఇచ్చిన సర్వే ఫలితాలు కొంచెం ఆశ్చర్యంగా, కొంత బాధను కలిగిస్తున్నాయన్నారు. నిమ్స్‌లో చేసిన సర్వే ప్రకారం.. ఎవరికైతే కిడ్నీ సమస్యలున్నాయో వారిలో 60శాతం మందికి హైపర్‌ టెన్షన్‌ ఉందన్నారు.

బీపీ, షుగర్‌ని ముందస్తుగా గుర్తించి.. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుందన్నారు. జీవనశైలిలో మార్పులతో ఈ సమస్యలు వస్తున్నాయని, ప్రజలు తమ ఆరోగ్యం పట్టించుకోకుండా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఇంతకు ముందు శారీరకంగా శ్రమ ఉండేదని, ఇప్పుడు నో ఫిట్‌నెస్‌ అని, ఆహారం అలవాట్లు బాగా మారిపోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ చేస్తున్నామని, 90లక్షల మందికి స్క్రీనింగ్‌ చేస్తే.. తమ స్క్రీనింగ్‌లో 13లక్షల మందికి హైపర్‌ టెన్షన్‌ ఉదన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్కరికీ బీసీ, షుగర్‌ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రూ.33కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. మందులు వాడుతున్నారా? లేదా? తెలుసుకునేందుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారత్‌లో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో తెలంగాణ మూడోస్థానంలో  ఉందని, రానున్న మూడు నాలుగు నెలల్లో మొత్తం పూర్తి చేసి మొదటి స్థానంలోకి తీసుకువస్తామన్నారు. ఆయుష్‌ ద్వారా 450 వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా మంచి ఆరోగ్యంపై శిక్షణ ఇవ్వనున్నామని, పోస్ట్‌ కొవిడ్‌ ద్వారా హైపర్‌ టెన్షన్‌ పెరిగినట్లు కనిపిస్తుందని మంత్రి తెలిపారు.

ఫిజికల్‌ యాక్టివిటీని పెంచాలని, పిల్లలకు వెల్త్‌ కాదు.. హెల్త్‌ ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల్లో సైతం కిడ్నీ సమస్యలుంటున్నాయన్నారు. హైదరాబాద్‌ నగరం మొత్తం సర్వే చేస్తామని, 350 బస్తీ దవాఖానల్లో 57 టెస్టులు చేస్తున్నామని, వచ్చే నెల నుంచి 120పైగా టెస్టులో చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రిపోర్ట్‌లను పేషెంట్లకు, వైద్యులకు మొబైల్‌ ద్వారా 24 గంటల్లో పంపిస్తామని, 45 సంవత్సరాలు దాటినా వారిలో బీపీ, షుగర్‌ టెస్టులను చేయించుకోవాలని కోరుతున్నామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్