Sunday, January 19, 2025
Homeసినిమాసెట్స్ పైకి చిరు 154వ చిత్రం

సెట్స్ పైకి చిరు 154వ చిత్రం

Mega#154:
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం ‘ఆచార్య‌’. ఈ సినిమా రిలీజ్ కాకుండానే.. చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్’ మూవీని సెట్స్ పైకి తీసుకువ‌చ్చారు. ఆ త‌ర్వాత ‘భోళా శంక‌ర్’ మూవీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు బాబీ డైరెక్ష‌న్ లో చేస్తున్న ‘వాల్తేరు వీర‌య్య’ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకువ‌చ్చారు. ఈ మూవీ టైటిల్ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు కానీ.. వాల్తేరు వీర‌య్య అనే టైటిల్ నే ఖ‌రారు చేశార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. చిరంజీవి, ఇతర తారాగణం పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సుదీర్ఘంగా ఈ షెడ్యూల్ ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం.

ఈ మూవీలో చిరు క్యారెక్ట‌ర్ ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్ అని.. చిరు అభిమానుల‌కు పండ‌గే అన్న‌ట్టుగా ఈ సినిమా ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ బాబీ తెలియ‌చేశారు. ఇది చిరంజీవి న‌టిస్తున్న 154వ చిత్రం. సంక్రాంతికి ఈ సినిమా నుంచి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. ఇక ‘భోళా శంక‌ర్’ విష‌యానికి వ‌స్తే…  ఈ మూవీ టైటిల్ సాంగ్ కోసం మరోసారి ఆయన అదిరిపోయే స్టెప్పులేశారని తెలిసింది. చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో చిరు స‌ర‌స‌న మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా న‌టిస్తుంది. మ‌రో వైపు ‘గాడ్ ఫాద‌ర్’ తాజా షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయ‌నున్నారు. ఇలా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్.

Also Read : స్వాగతిస్తున్నాం, కానీ…: చిరంజీవి

RELATED ARTICLES

Most Popular

న్యూస్