Saturday, March 21, 2026
Homeసినిమానాని 30వ చిత్రం ప్రారంభం

నాని 30వ చిత్రం ప్రారంభం

నేచురల్ స్టార్ నాని 30వ చిత్రం నేడు హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైంది.  శౌర్యువ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ లు వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై  నిర్మిస్తున్నారు.

ముహూర్తం షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టగా.. అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకు ముందు విజయేంద్ర ప్రసాద్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. పలాస కరుణ్ కుమార్, గిరీష్ అయ్యర్, దేవకట్టా, చోటా కె నాయుడు, సురేష్ బాబు, దిల్ రాజు, 14 రీల్స్ గోపి- రామ్ ఆచంట, ఎకె అనిల్ సుంకర, మైత్రి రవి, డివివి దానయ్య, స్రవంతి రవి కిషోర్, కెఎస్ రామారావు, సాహు గారపాటి, ఏషియన్ సునీల్, అభిషేక్ అగర్వాల్, నిహారిక కొణిదెల, కళ్యాణ్ దాసరి తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్  రేపటినుంచే  మొదలు  కానుంది.

మృణాల్ ఠాకూర్ నానికి జోడిగా నటించనుంది. సాను జాన్ వర్గీస్ డీవోపీగా,  ‘హృదయం’ ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించనున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular