Saturday, January 18, 2025
Homeసినిమానీలాంబరి పాట విడుదల.. మణిశర్మకు మెగా ప్రశంసలు

నీలాంబరి పాట విడుదల.. మణిశర్మకు మెగా ప్రశంసలు

Chiranjeevi Commended Mani Sharma For Neelambari Tune In Acharya :

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ మూవీ ‘ఆచార్య’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటించగా, చరణ్ సరసన పూజా హేగ్డే నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ మరియు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. చరణ్‌, పూజా హేగ్డేల పై చిత్రీకరించిన సాంగ్ నీలాంబరి ని చిత్ర యూనిట్ ఈరోజు రిలీజ్ చేశారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ మళ్ళీ ఓ క్లీన్ మెలోడీ సాంగ్ ను తన మార్క్ లో అందించారని చెప్పచ్చు. గీత రచయిత అనంత్ శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా కలిసి ఈ పాటను ఆలపించారు.  ఇందులో చరణ్ వేసిన అదిరిపోయే స్టెప్పులు.. నీలాంబరిని వర్ణించే విధానం కట్టిపడేస్తుంది. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు. అందమైన అవుట్ డోర్ లొకేషన్స్ లో స్పెషల్ సెట్ లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు విశేష స్పందన లభిస్తుంది.

నీలాంబరి పాట ద్వారా మణిశర్మ తన ప్రతిభను చాటుకొని, మెలోడి బ్రహ్మగా మరోసారి రుజువు చేసుకున్నారని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఈ విధంగా మణిశర్మని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు.

Must Read :చరణ్‌ – శంకర్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్