Thursday, March 12, 2026
Homeసినిమామెగాస్టార్ నాకు పునర్జన్మ ఇచ్చారు: డైరెక్టర్ మెహర్ రమేశ్ 

మెగాస్టార్ నాకు పునర్జన్మ ఇచ్చారు: డైరెక్టర్ మెహర్ రమేశ్ 

కెరియర్ పరంగా మెహర్ రమేశ్ కి చాలా గ్యాప్ వచ్చింది. కాస్త ఆలస్యమైనా ఆయన చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాను చేశాడు. ఈ సినిమాను ఈ నెల 11న థియేటర్లకు తీసుకొస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో నిన్న ఆయన మాట్లాడుతూ .. తాను ఈ జన్మలో చేసుకున్న అదృష్టం ఏదైనా ఉంటే అది ఈ సినిమా చేయడమేనని అన్నారు. కొంతకాలంగా తాను షాడోలో ఉండిపోయాననీ, అలాంటి తనపై మెగాస్టార్ వెలుగు పడిందని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే తనకి ఆయన పునర్జన్మను ఇచ్చారని అన్నారు.

తాను అన్నయ్యతో ఇలాంటి ఒక సినిమా చేయాలనుకోవడం వేరనీ, అందుకు నిర్మాతలు సహకరించడం వేరనీ, అలాంటి నిర్మాత తనకి దొరకడం కూడా తన అదృష్టమేనని అన్నారు. అన్నయ్యతో ఎలాంటి సినిమాను చేయాలని అనుకున్నానో అలాంటి సినిమానే చేయగలిగాననే సంతృప్తి ఉందని చెప్పారు. చిరంజీవి గారి అభిమానిగా చెప్పుకుని గర్వపడే తనకి, ఆయనతోనే సినిమా చేసే ఛాన్స్ రావడం గొప్పవిషయంగా భావిస్తున్నానని అన్నారు. ఒక ‘గ్యాంగ్ లీడర్’ .. ‘రౌడీ అల్లుడు’ తరువాత సినిమా ఎలా ఉండాలని అనుకుంటారో, అలా ఈ సినిమా ఉండేలా చూసుకున్నామని చెప్పారు.

ఈ సినిమాకి పనిచేసిన తన టీమ్ అంతా కూడా అన్నయ్య ఫ్యాన్స్ అనడం కంటే, ఆయన లవర్స్ అంటేనే కరెక్టుగా ఉంటుందనీ, అందువల్లనే ఆయన సినిమాకి ఇష్టంగా కష్టపడుతూ రావడం జరిగిందని అన్నారు. అన్నయ్య తనని ఇంత పెద్ద అవకాశం ఇచ్చారనీ .. ఆయన పట్ల తనకి గల అభిమానాన్ని చూపించుకోవడానికే ఈ జన్మ చాలదంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ ఫంక్షన్ కి హాజరైన బాబీ .. వంశీ పైడిపల్లి .. గోపీచంద్ మలినేని .. సంపత్ నంది వంటివారు, ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular