Monday, February 24, 2025
HomeTrending Newsజనసేనకు చిరంజీవి రూ. 5 కోట్ల విరాళం

జనసేనకు చిరంజీవి రూ. 5 కోట్ల విరాళం

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళం అందించారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ చేస్తోన్న ప్రజా సేవకు తన వంతు తోడ్పాటుగా ఈ సాయం అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో చిరు నటిస్తోన్న ‘విశ్వంభర’ షూటింగ్ జరుగుతోంది. ఈ లోకేషన్ కు పవన్ కళ్యాణ్, నాగబాబు కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికలు, రాజకీయ పరిస్థితులపై  మెగా బ్రదర్స్ మధ్య కాసేపు చర్చ జరిగింది. అనంతరం ఐదు కోట్ల రూపాయల చెక్కును పవన్ కు అందించారు. చిరంజీవి పాదాలకు పవన్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
“అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను” అంటూ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్