Sunday, January 19, 2025
HomeTrending Newsఎండ్ కాదు... శుభం కార్డు పడుతుంది: చిరు

ఎండ్ కాదు… శుభం కార్డు పడుతుంది: చిరు

Productive: సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు నేడు పరిష్కారం లభిస్తుందని  మెగా స్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.  సిఎం జగన్ తో సమావేశం అయ్యేందుకు విజయవాడ వెళుతూ బేగంపేట విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘నేడు ఎండ్ కార్డు కాదు, శుభం కార్డు పడుతుంద’ని చెప్పారు.  సిఎంతో భేటీ తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు  చెప్పారు.  సమావేశం అయిన తర్వాత అక్కడి మీడియా పాయింట్ వద్ద  అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

సిఎం తో భేటీకి ఎవరెవరు వస్తున్నారనేది తనకు తెలియదని, తనకు మాత్రం  ఆహ్వానం ఉందని, ఎవరెవరిని పిలిచారనేది సిఎంవో కే తెలుసని వ్యాఖ్యానించారు. విజయవాడ ఎవరెవరు వస్తున్నారనేది తాను మీడియాలోనే చూశానన్నారు.

కాగా, బేగంపేట్ విమానాశ్రయం నుంచి చిరంజీవి తో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ విజయవాడ బయల్దేరి వెళ్ళారు.  నాగార్జునకు ఆహ్వానం ఉన్నప్పటికీ అయన స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో వెళ్ళడంలేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా భేటీకి గైర్హాజరు అవుతున్నట్లు తెలిసింది.  ఇప్పటికే ఆర్. నారాయణ మూర్తి, పోసాన కృష్ణ మురళి విజయవాడ చేరుకున్నారు. వారు కూడా సిఎంతో సమావేశంలో పాల్గొనబోతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్