Monday, March 16, 2026
Homeసినిమాఆచార్య విడుదల వాయిదా!

ఆచార్య విడుదల వాయిదా!

Acharya… wait for some time: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ ఆచార్య‌ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కోవిడ్ మూడో దశలో ఓమిక్రాన్ ప్రభావంతో వాయిదా వేశారు.  ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ క్రేజీ మూవీ ఆచార్య ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇప్పుడు  ఫిబ్రవ‌రి 4న ఆచార్య చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు.

ప్రమోష‌న్స్ కూడా మొదలుపెట్టి ఇటీవలే ‘సానా క‌ష్టం’.. అనే పాట రిలీజ్ చేశారు. ఫిబ్రవరి నాటికి కోవిడ్ కేసులు భయంకరంగా పెరుగతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు విడుదల చేసేదీ త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ తెలియజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular