Saturday, January 18, 2025
Homeసినిమాకోలీవుడ్ డైరెక్టర్ తో మెగాస్టార్ మూవీ..?

కోలీవుడ్ డైరెక్టర్ తో మెగాస్టార్ మూవీ..?

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చిరు కెరీర్ లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది. ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరుకు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుంటే.. చెల్లెలుగా కీర్తి సురేష్‌ నటిస్తుంది.

ఇటీవల భోళా శంకర్ మూవీ కోసం చిరు, 200 మంది డ్యాన్సర్ల పై ఓ సాంగ్ చిత్రీకరించారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు గట్టిగా వినిపించాయి. అయితే.. తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తోంది. ఎవరా కోలీవుడ్ డైరెక్టర్ అంటే.. మురుగుదాస్. గతంలో చిరు, మురుగుదాస్ కాంబినేషన్లో ‘స్టాలిన్’ సినిమా రూపొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యింది.

అయితే.. ఇటీవల చిరంజీవి కోసం మురుగుదాస్ కథని సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. శివ కార్తికేయన్ తో మురుగదాస్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవికి కథని వినిపించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. అయితే.. శివ కార్తికేయన్ వరుసగా ఈ ఏడాది మూడు ప్రాజెక్ట్స్ తో ఉండటంతో ముందుగానే చిరంజీవితో సినిమా చేయాలని కూడా మురుగదాస్ ప్లాన్ చేసుకుంటున్నారట. అందుకే అదిరిపోయే స్టొరీ లైన్ రెడీ చేసుకొని మెగాస్టార్ ని ఒప్పించడానికి ట్రై చేస్తున్నట్టు తెలిసింది. మరి.. మురుగుదాస్ కి మెగాస్టార్ ఓకే చెబుతారో లేదో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్