చిరంజీవి ఆమధ్య నటించిన ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్ అవ్వడంతో చాలా ఫీలయ్యారు.. ‘గాడ్ ఫాదర్’ చేశారు. ఆతర్వాత చేసిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. వీరయ్య ఇచ్చిన జోష్ తో ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నారు.
ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు కానీ.. రోజుకో వార్త ప్రచారంలోకి వస్తుంది. చిరంజీవితో సినిమా చేయడం కోసం ట్రై చేస్తున్న దర్శకులు అంటూ పూరి, వెంకీ కుడుముల, కళ్యాణ్ కృష్ణ పేర్లు వినిపించాయి. తాజాగా ఇద్దరు సీనియర్ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఎవరా సీనియర్ డైరెక్టర్స్ అంటారా..? వి.వి.వినాయక్, కృష్ణవంశీ. చిరంజీవి, వినాయక్ మధ్య మంచి అనుబంధం ఉంది. ‘ఠాగూర్’ సినిమాను వినాయకే డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది. చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 కూడా వినాయక్ డైరెక్షన్ లోనే వచ్చింది.
గాడ్ ఫాదర్ మూవీని వినాయకే తెరకెక్కించాలి అనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు వినాయక్ తో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. అలాగే కృష్ణవంశీతో కూడా చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. గతంలో చిరంజీవికి కృష్ణవంశీ ‘వందేమాతరం’ అనే కథను వినిపించారు. అయితే.. అప్పుడున్న కమిట్మెంట్స్ వలన ఆ కథను చేయడం కుదరలేదు. తాజాగా మరోసారి కథను విన్న చిరంజీవి కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పినట్టుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కృష్ణవంశీ మార్పులు చేర్పులు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. వినాయక్, కృష్ణవంశీ ఈ ఇద్దరితో చిరు సినిమాలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఈ సినిమాల పై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.