Saturday, March 14, 2026
Homeసినిమాఆర్ఆర్ఆర్ పై చిరు, ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే....

ఆర్ఆర్ఆర్ పై చిరు, ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే….

Response on RRR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర‌ర్ విడుద‌లైంది. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ అయితే.. న‌ట‌విశ్వ‌రూపం చూపించారు. కామన్ మేన్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ట్విట్టర్ లో స్పందించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే.. “మాస్ట‌ర్ స్టోరీ టెల్ల‌ర్ అందించిన మాస్టర్ పీస్ ఇది. రాజమౌళి అసమానమైన సినిమా విజన్ కి ఒక గ్లోయింగ్ & మైండ్ బ్లోయింగ్ సాక్ష్యం. ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి హ్యాట్సాఫ్” అంటూ చిరంజీవి ఆర్ఆర్ఆర్ టీమ్ ని అభినందించారు.

ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అయితే “మీ అచంచలమైన ప్రేమకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు, మద్దతు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి ఆస్వాదించండి”  ఎన్టీఆర్ ట్వీట్ లో పోస్ట్ చేశారు. ఈ రెండు  ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

Also Read : సుక్కు భావోద్వేగ ట్వీట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular