Saturday, January 18, 2025
Homeసినిమాపావ‌లా శ్యామ‌ల‌ను ఆదుకున్న ‘చిరు’

పావ‌లా శ్యామ‌ల‌ను ఆదుకున్న ‘చిరు’

సీనియర్ నటి పావ‌ల శ్యామ‌లను మరోసారి ఆర్ధికంగా ఆదుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా కష్ట కాలంలో ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలుసుకుని చిరంజీవి ఆమెకు `మా` త‌ర‌పున స‌భ్య‌త్వ‌ కార్డ్ నిమిత్తం మంగళవారం నాడు 1,01,500 చెక్ ని క‌రాటే క‌ళ్యాణి, సురేష్ కొండేటిల ద్వారా అందించారు..

ఇక‌ పై పావలా శ్యామలకు ‘మా’ మెంబ‌ర్ షిప్ కార్డ్ తో ప్రతి నెలా 6 వేల చొప్పున పెన్షన్ రూపంలో  అందుతుంది. ఈ క‌ష్టకాలంలో ఆపద్బాంధవుడిలా పావ‌ల‌శ్యామ‌ల‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చిరంజీవికి తన కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు శ్యామల.  ‘ఈ క‌ష్టంలో మ‌రోసారి లక్షా పదిహేను వందల రూపాయలు చెక్  రూపంలో ఇచ్చి… ప్రతి నెలా ఆరువేల రూపాయలు సాయం అండేలా చిరంజీవి గారు సాయ‌ప‌డ్డారు. మ‌న‌స్ఫూర్తిగా వారికి నా ధ‌న్య‌వాదాలు’ అంటూ తన సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్